ముప్పు అంచన మంచు పర్వతాలు :- ఎడ్ల లక్ష్మి
పిల్లల్లారా జాగ్రత్తగా వినండి 
ఇటీవల ఖాట్మండు నగరంలో 
నిర్వహించిన మౌంట్ ఎవరెస్ట్ 
పరిశీలన కార్యక్రమం గూర్చి వినండి 

జాతీయ ప్రాంతీయ ప్రాధాన్యంపై
దృష్టి సారించిన మన పెద్దలు 
భారత్ చైనాతో పాటు12 దేశాల  
ప్రతినిధులు 300 పైచిలుకు పాల్గొన్నారు 

భూతాప వాయువుతో ముప్పు 
తలెత్తే ప్రమాదాల బాధలను 
వారంతా విశ్లేషించి
రాబోయే పరిస్థితుల గూర్చి తెలిపారు 

హిమ ఖండాలు కరిగిపోయి 
పలుచబడి పరిమాణం తగ్గిపోయి 
నేపాల్ లో భూతాపం పెరిగి 
ప్రజలు నానా బాధలు పడుతున్నారటా


కామెంట్‌లు