ఎవరు దీనికి బాధ్యులు?:- కవిమిత్ర, సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి) విశాఖపట్నం.
నేటి సమాజంలో ఐదేండ్ల పిల్లలనుంచి
ఎనభై ఏండ్లుదాటిన వృద్ధుల వరకు
అలరించి ఆనందించే క్రీడ క్రికెట్.
పూర్వం ఐదు రోజులు మూడు రోజులు
ఆ తరువాత ఒక రోజు కి పరిమితమై. 
ఆ రోజంతా  దూరదర్శన్ లకే  ఇంట్లో ఉన్నవారంతా అతుక్కుని చూసే క్రీడ
ఫోర్, సిక్స్ ,నోబాల్,వైడ్ అని చప్పట్లతో
పిల్లలే కాదు తాతయ్యలు బామ్మల  ఇష్టమైన ఆట
సినీ నటీనటుల అభిమానులను మించి
క్రికెట్ క్రీడాకారుల అభిమానులు పెరిగిన సమాజాన
నిన్న జరిగిన క్రికెట్ విజయోత్సవ సంబరాలలో
తమ క్రీడాకారులను చూసేందుకు వచ్చిన 
ఎంతో భవిష్యత్ కలిగిన యువత
సరి అయిన ప్రణాళికా రక్షణ లేక
తొక్కిసలాటలో  దుర్మరణం పాలై
కన్నవారి కడుపుకోతకు కారణమైన సంఘటనకు
ఎవరు బాధ్యులు?
విజ్ఞులు, ప్రాజ్ఞులు ఒక్కసారి ఆలోచించండి..!!


( బెంగుళూర్ చిన్నస్వామి క్రికెట్ స్టేడియం లో జరిగిన సంఘటన లో పదకొండు మంది యువత అనేక మంది తీవ్రగాయాల పాలయ్యారని విని ఆర్ధ్రత తో వ్రాసినది)
..............................

కామెంట్‌లు