సాహితీ కవి కళా పీఠం.
సాహితీ కెరటాలు.
=================
వచ్చే వచ్చే,వెండి మబ్బులు.
గిచ్చే గిచ్చే, పిల్లగాలులు.
పొలాలవేంట తిరుగుతూ,ఆటలు,
బాల్యం లోకి, తొంగి చూస్తే !
వద్దన్న పని, చెయ్యటాలు, అమ్మ
కోప్పడితే,"బుంగమూతి విన్యాసాలు ".
ఇంట్లో యువరాణి, అలకల కొలికి,
అమ్మడు చెప్పిందే వేదం.
" చిట్టి చిట్టి చేతులతో అమ్మకుసాయం."
" కొంటె కోణంగి పనులు చీవాట్లు."
బొమ్మల కొలువులు,పట్టు పరికిణీ,
పూలజడలు, పారంటాలు,
గోరింటాకులు, ఇంట్లో జాతరే.
ఊరంతా చుట్టాలే, అల్లరి ఆటలే.
స్కూల్ లో,మొదటి రాంకే.
సెలవులు వస్తే, ఇల్లంతా కంగాళీ.
గోరుముద్దలు, తాతయ్య కధలు.
పిల్లలతో పేచీలు, అమ్మఅరుపులు.
"మొగరాయుడి ఆటలు "అంటూ...
అమ్ముమ్మ, సన్నాయి నొక్కులు.
"ఒక్కతైనా పదిమంది పెట్టు" అని..
బామ్మ సర్టిఫికెట్, హాయిగా నవ్వటం, సరదాలు, సంతోషాలు.
అబ్బాయిలను,ఏడిపించటం.
వాళ్ళు తాతయ్య తో, పితూరీలు.
చెరువు గట్టున, షికార్లు.
డాబాపై, చందమామ కబుర్లు.
"చుక్కల లెక్కలు", పోటీలు.
పద్యాలు,పాటలు, డాన్సులు.
*బహుమతులే,బహుమతులు."
తాతయ్య కు, ఏనుగు నెక్కినఅంత, సంబరం.
ఒకటా రెండా, మధుర స్మృతులు.
బుజ్జమ్మ కి సాటి,ఎవరూ లేరు,
రారు ! అనేది భరత వాక్యం.
బంగారు బాల్యం.:- సి. హెచ్. అనసూయ.-హైదరాబాద్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి