అది ఒక కార్పోరేట్ స్కూల్ .అక్కడ చదివే విద్యార్థులంతా హై సొసైటీకి సంబందించినవారే.లక్షల డొనేషన్ కట్టి, ఇష్టంగా, మోజుగా చదివిస్తూవుంటారు.
ఆ స్కూల్ కాంపౌండులో తెలుగు మాట నిషిధ్ధం.ఆయాలు,ప్యూన్స్ కూడా తెలుగు మాట్లాడడం కూడదు.
ఆవిషయం తెలుసుకొనే తల్లితండ్రులు తమపిల్లలను ఆ కార్పోరేట్ స్కూల్లో లక్షలు క్యూలో నుంచుని కట్టి మరీ చేరుస్తారు."మా పిల్లల స్కూల్లో ఆయాలు ,అటెండర్లు
చివరకు స్వీపర్స్ కూడా ఇంగ్లీష్ లో మాట్లాడతారు తెలుసా!" అని గర్వంగా చుట్టాలతో,స్నేహితులతో చెప్పుకుంటారు.
ఆస్కూల్లో తెలుగు ఒక సబ్జక్ట్ గా తీసుకొనే
విద్యార్థులే చాలా తక్కువ. గవర్నమెంటు రూల్ గురించి ఒకరిద్దరు తెలుగు టీచర్స్ వున్నా వారికి వారానికి తరగతికి ఒకటి రెండు క్లాస్ లుండడమే గగనం. మాథ్స్ టీచరో ,ఫిజిక్స్ టీచరో,బైయాలజీటీచరో వచ్చి మాకు కోర్స్ లు అవ్వలేదు ,మేం ఈ పిరియడ్ తీసికొంటాం అంటూ తీసేసుకొంటారు.
తెలుగు క్లాసులే కాదు ,సోషల్ క్లాసులూ అంతే ,ఆఆ టీచర్ల దృష్టిలో,తెలుగు,సోషల్ టీచర్స్ పనికిమాలినవారు. తెలుగు ,సోషల్ టీచర్లను తమతో కలుపుకోరు,స్నేహం చెయ్యరు.హిందీ టీచరంటే వారి దృష్టిలో పురుగు కన్నా హీనం.
అలాంటి స్కూలుకి క్రొత్తగా తెలుగుకి విద్యా టీచర్ వచ్చింది.ఆమె టైంటేబుల్ ప్రకారం నైంత్ క్లాసుతీసుకోవడానికి వచ్చింది.
ఫిజిక్స్ టీచర్ ",సారీ!మేడమ్ ! ఈక్లాస్ నేను తీసుకొంటాను" అని క్లాస్ కి వెళ్ళబోతుంటే, విద్యాటీచర్ "సారీ! ,ఇది నా పిరీయడ్ , నేనుమీకివ్వ ఇవ్వలేను." అని మృదువుగా చెప్పి తరగతిలోకి వెళ్ళింది.
"తెలుగు దేముంది టీచర్ ,ఒక్కరోజులో మొత్తం చెప్పిపడేయొచ్చు. ఫిజిక్స్ అలాకాదు,మహాసముద్రంలాంటిది,ఎంత చెప్పినా తరగదు అంటూ ఇంకా ఏదో చెపుతుంటే,విద్య "సారీ! టీచర్ !
నా సబ్జక్ట్ నాకు గొప్ప,నేను ఇది
చాలా ఇష్టపడి చదివి వచ్చాను.నావిద్యార్థులకు నా సబ్జక్ట్ ఇష్టంగా నేర్పిస్తాను .ఇంకెప్పుడూ నా పిరియడ్ అడగకండి, నేనివ్వను అని నిక్కచ్చిగా చెప్పి,క్లాస్ కి వెళ్ళి పోయింది.
బోడి తెలుగు, ఇంతోటి తెలుగుకి అంత గర్వమెందుకో!మూతి తిప్పుకుంటూ వెళ్ళి పోయింది ఫిజిక్స్ టీచర్ .
ఫిజిక్స్ టీచర్ కి చెప్పినట్లే మిగిలిన సబ్జక్ట్ టీచర్లకి కూడా తనపిరీయడ్ ఇవ్వడం కుదరదని నిర్మొహమాటంగా చెప్పింది.తమసబ్జక్టే ఘనమైనదనుకొనే టీచర్లందరూ కలసి మేనేజ్ మెంట్ కి కంప్లైట్ చేసారు విద్యా టీచర్ పైన-'తెలుగు అవసరం లేదనుకొన్నప్పుడు నన్ను తీసుకోకుండా వుండాల్సింది సార్ !నా సబ్జక్ట్ లో విద్యార్థులుపాసవాలి అంటే నేను నాపిరియడ్స్ ఇతరులకు ఇవ్వలేను"' .నిర్మొహమాటంగా
చెప్పింది విద్యాటీచర్ మేనేజ్ మెంట్ కి.
విద్యాటీచర్ పిరీయడ్ అంటే ఇప్పుడు విద్యార్థులు చెవులు కోసుకుంటారు.ఇదివరకులా
తెలుగు పిరీయడ్ ని తప్పని సరి తద్దినంరా బాబూ అనే రోజులు పోయాయి.తెలుగు టీచర్ ని పేర్లు పెట్టి ఏడ్పించటం పోయింది. తరగతిలో కిసకిస నవ్వులూ ,గుసగుస మాటలూ లేవు.ఎందుకు?
ఎందుకంటే విద్యాటీచర్ పాఠం ఇష్టగా చెపుతుంది.పాఠం మద్యలో సందర్భంకుదిరితెే ఆ సందర్భానికి తగిన కథ చెపుతుంది.సబ్జక్ట్ అయినంత వరకు ఆఆపాఠాలకు సంబదించి పజిల్స్ పెట్టి చక్కగా ముందుగా పూరించిన
వారికి మార్కులు వేసి చిన్న చిన్న బహుమతులిస్తుంది.
అలాగే చిన్న చిన్న గేయాలు ,పద్యాలు,వ్యాసాలు వ్రాయించి ,వివిధ రకాలైన పత్రికలలో స్కూలు పేరుతో పాటుగా,విద్యార్థుల ఫతరగతి,పేరు,ఫోటో వచ్చేలా శ్రధ్ధ తీసుకొంటుంది.
ఇప్పుడు విద్యాటీచరంటెే మిగిలిన టీచర్లకేకాదు ,మేనేజ్ మెంటుకు కూడా గౌరవమే!
ఆసంవత్సరం
ఏనివర్స్ డే పోటీల్లోవిద్యాటీచర్ వ్రాసి,
పిల్లలు నటించిన 'తెలుగు వైభవము'అన్న నాటికను దూరదర్శన్ వారు దూరదర్శన్ లో ఈ స్కూలు విద్యార్థులచేతే నటింప చేస్తే ,పిల్లల నాటికలడివిజన్ లో 'తెలుగు విజయం'నాటకానికి నంది బహుమతి వచ్చిందని తెలిసి నప్పుడు ఆస్కూల్ మేనేజ్ మెంట్ తో పాటు టీచర్స్ ,ఆ స్కూల్లో చదివే విద్యార్థులే కాదు వారి తల్లి తండ్రులు
అమితంగా గర్వించారు.
మేనేజ్ మెంట్ వచ్చే విద్యా సంవత్సరంలొ తమ స్కూల్లో పెరిగే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మరిన్ని సెక్షన్లని
ఓపెన్ చెయ్యడానికి విద్యా శాఖకు అప్లికేషన్ ఫారాలు తయారు చెయ్యమని తమ క్లర్క్ కి ఆదేశించారు.
'తెలుగు విభవము వర్థిల్లుగాక'
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి