ప్రేమ మౌనం :- డా. కె మంజు ప్రీతం -మదనపల్లె

 సాహితీ కవి కళాపీఠం 
సాహితీ కెరటాలు 
=============
మాటలు రాని మౌనం అది,
గుండె లోతుల్లో దాగున్న ప్రేమ అది.
చూపుల్లోనే వేల భావాలు,
స్పర్శతోనే అల్లుకున్న అనుబంధాలు.
కళ్ళలో మెరిసేటి కాంతులు,
నిట్టూర్పులో నిండిన ఆశలు.
ఒకరికొకరు తోడున్న క్షణాలు,
కథలకెక్కని సుందర భావాలు.
చెప్పకుండానే తెలిసిన స్నేహం,
దూరం లేని దగ్గరి బంధం.
ప్రతి అడుగులోనూ నీ అండ,
మాటాడకపోయినా తీరిన పండ.
ఊహల్లోనే తేలియాడే ప్రపంచం,
నిరీక్షణలోనూ నిండిన సంతోషం.
అంతులేని మౌన ప్రేమ,
ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకం.

కామెంట్‌లు