కానుకలు : - సరికొండ శ్రీనివాసరాజు

 మన కోరికలు తీరాలని
సుదూర ప్రాంతాలకు  వెళ్ళి
గిరులపై దేవుళ్లను దర్శించి
విలువైన కానుకలను 
సమర్పింతుము నిత్యం  
మరి అడుగకనే అనునిత్యం
తాను కడుపు మాడ్చుకుంటు
మన కడుపులు నింపుటకు
కర్షకుడు శ్రమించు నిత్యం 
ఆ దేవునికే అనునిత్యం   
కానుకలను చెల్లిస్తూ
బ్రతికించుకున్న మనము
కలకాలము జీవింతుము
సుఖ సంతోషాల సిరులతో
కామెంట్‌లు