ఇంటి వసారాలో వాలు కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు వ్యాపారవేత్త శ్రీకాంత్. ఇంతలో భార్య రుక్మిణి ఏతెంచి. వ్యాపారాలు ఎప్పుడు ఎవరిని అట్టడుగు స్థానానికి నెట్టుతాయో ఎప్పుడు ఆకాశ అంచులు దాటిస్తాయో! ఎవరికి తెలిసు. వ్యాపారంలో నష్టం వచ్చి ఉన్నదంతా ఊడుచుకుపోయింది. మన పరిస్థితి ఇలా తగలాడింది. అందుకే ఎప్పుడూ చెప్తూ ఉంటాను *ఎదుటివారిని ఎప్పుడు బాధ పెట్టవద్దని*. వింటారా? అవకాశం దొరికితే చాలు అడ్డగోలుగా ముక్కు మొహం తెలియకుండా మాటలతో మభ్యపెడతారు అంటూ కాఫీ కప్పు అందించి రుసరసలాడుతూ లోపలికి వెళ్ళింది భార్య జానకి. ఇంతలో తల్లి విశాలాక్షి కలుగజేసుకొని తగ్గితే తప్పేముంది నాన్న. నా మాట వినరా శ్రీకాంత్. గోపాల్ మరె వరో కాదు నీ చిన్ననాటి స్నేహితుడు. ఏవో పరిస్థితుల వల్ల అలా గొడవ పడ్డారు. జరిగిందేదో జరిగిపోయింది. తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటాడు. నా మాట వినరా! ఒక్కసారి వెళ్లి తనను ఆర్థిక సహాయం అడగరా కంపెనీని మళ్లీ పునరుద్ధరించుకోవడానికి, వెళ్లరా వెళ్లి అడగరా శ్రీకాంత్. పరిస్థితులు కుదుటపడ్డాక తిరిగి ఇచ్చేదువులే అంటూ సర్ది చెప్పింది తల్లి విశాలాక్షి.
లేదమ్మా నా వ్యాపారానికి అడ్డు వస్తున్నాడన్న భావనతో అహంకారపు పొరలు కమ్మి చెడామడ తిట్టి పడేసాను. మరి ఇప్పుడే మొఖం పెట్టుకొని మరి ఇప్పుడే ముఖం పెట్టుకుని ఆర్థిక సహాయం చేయమని అడగమంటావమ్మ. అని ఆవేదన వ్యక్తం చేశాడు శ్రీకాంత్. చూడు నాన్న గోపాలం గురించి నాకు బాగా తెలుసు .అంతస్తు హోదా కంటే మమకారం మంచితనం శాశ్వతమైనది అని నమ్మే వ్యక్తి తాను. పైగా స్నేహానికి విలువ ఇచ్చే రకం. నిన్ను ఎప్పటికీ నిరాశపరచడు. నా మాట విను. అని నచ్చ చెప్పింది తల్లి. కానీ మనసు అంగీకరించడం లేదు
పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు శ్రీకాంత్.
ఇంతలో భార్య జానకి గట్టిగా అరుస్తూ.. వెలగబెట్టిన నిర్వాహకానికి ముఖం చెల్లట్లేదు కాబోలు! అని ఎద్దేవా చేయ సాగింది. లంకంత కొంపను నడిపేది ఎవరు? కూతురు పెళ్లి చేసేది ఎవరు. అని గట్టిగా చివాట్లు పెట్టింది వంటింట్లో కూరగాయలు తరుగుతూ. మనసుంటే మార్గం ఉంటుంది ఇకనైనా పంతం పట్టింపుమాని
మనసు మార్చుకొండిఅంది తన భార్య జానకి. ఇకనుండి ఎవరిని ఏమి అనవద్దు అని ఖచ్చితంగానిర్ణయించుకున్నాడు శ్రీకాంత్. పోనీలే గోపాలం మరెవరో కాదు నా చిన్ననాటి మిత్రుడే కదా! క్షమించమని వేడుకుంటాను. అని ఇంట్లో వాళ్లకి చెప్పి... గోపాలం కంపెనీలో అడుగుపెట్టాడు ఆత్మాభిమానం అడ్డు వచ్చినా మెల్లమెల్లగా గోపాలం క్యాబిన్ వైపు అడుగు పెడుతూ. మెట్లు ఎక్కుతున్నాడు శ్రీకాంత్.
ఇంతలో శ్రీకాంత్ అన్న పిలుపుతో ఒకేసారి వెనుతిరిగి చూసాడు శ్రీకాంత్. ఎదురుగా గోపాలం ఒక్క ఉదుటునా పరిగెత్తుకొని వచ్చి గాఢంగా శ్రీకాంత్ ను తన గుండెలకు హత్తుకున్నాడు గోపాలం.
ఏరా! శ్రీకాంత్ ఎలా ఉన్నావు? అంటూ ఆ.హఠాత్పరిణామానికి నిశ్చేష్టుడయ్యాడు శ్రీకాంత్. ఏరా గోపాలం నేను అంతగా తిట్టాను. నీ మనసుని బాధ పెట్టాను నా వ్యాపారానికి అడ్డు వస్తున్నావని. నీకు నా మీద కోపం లేదా! అన్నాడు శ్రీకాంత్. నాకెందుకురా కోపం. నేను నీ వ్యాపారానికి అడ్డు వస్తున్నానని నువ్వు పొరపాటు పడుతున్నావని నేను అర్థం చేసుకున్నాను. ఏనాటికైనా నువ్వే నిజం తెలుసుకుంటావు. మనసు మార్చుకుంటావని నాకు అర్థమైంది. మీ మార్పుకై ఎదురు చూస్తున్నాను. నువ్వేమైనా పరాయివాడివా! నా మిత్రుడువే కదా. జీవితం అన్నాక మబ్బులు మెరుపులు వస్తూనే ఉంటాయి. పంతాలు పట్టింపులకు పోతే ఫలితం శూన్యం అన్నాడు గోపాలం. ఎంత ఎత్తుకు ఎదిగినా స్నేహానికి అంత విలువ ఇచ్చే గోపాలాన్ని చూస్తూ స్నేహితుడి వంటే నువ్వేరా స్నేహమంటే నీదేరా అంటూ మరొక్కసారి గోపాలాన్ని మనస్ఫూర్తిగా తన గుండెలకు హత్తు కున్నాడు శ్రీకాంత్. ఇంతకీ నీ రాకకు కారణమేంటో తెలుపగలవా! ఆనందం నిండిన కళ్ళతో ప్రశ్నించాడు గోపాలం. పరిస్థితి అంతా వివరించాడు శ్రీకాంత్. వ్యాపారంలో నష్టపోయాను కదా! ఇప్పుడు నువ్వు నాకు కాస్త ఆర్థిక సహాయం అందిస్తే మళ్లీ తిరిగి నీ డబ్బులు నీకు వడ్డీతో సహా చిల్లి గవ్వ కూడ పోల్లు పోకుండా ఇస్తాను అన్నాడు శ్రీకాంత్ . అరే డబ్బులేమైనా ఊరికే వస్తాయా ఎంతో కష్టపడితే కానీ కొన్ని డబ్బులు వెనుకేసుకోలేము. నాకు వడ్డీ ఏమాత్రం వద్దు. నీ వ్యాపారం మళ్లీ అభివృద్ధి చెంది పరిస్థితులు కుదుటపడ్డాక నా అసలు డబ్బులు నాకు ఇస్తే చాలు అన్నాడు గోపాలం .ఆర్థిక సహాయమే కాదురా! నీ కూతుర్ని కూడా నా కోడలిగా చేసుకుంటాను. అన్న గోపాలం మాటలకి శ్రీకాంత్ మనసు ఉప్పొంగిపోయింది. తనకు కూడా తన మిత్రుడు గోపాలం లాంటి మంచి మనసును ప్రసాదించమని ఆ...భగవంతున్ని మనస్ఫూర్తిగా వేడుకున్నాడు. మనసు మార్చుకున్నాడు. మానవత్వాన్ని నింపుకున్నాడు. మనసున్న మహారాజుగా మారాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి