‘శ్రమ జీవిని’:- రచన , చిత్రం :పైడి రాజ్యలక్ష్మి
శ్రమ జీవిని నేను
అలుపెరుగని సేవకుడను!
కరువులే వచ్చినా… కోటాలే ఇచ్చినా
కష్టాలే ఎదురైనా… కడుపులే కాలినా
ప్రభుత్వ పథకాలను ప్రకటించాలన్నా
వాడవాడలా తిరిగే మాధ్యముడను!

సంబరం చేసినా… శుభకార్యం తలపెట్టినా
చివరి మజిలీ శివపురికి సాగనంపినా…
పరమశివుని చేతిలోని ఢమరుక నాదంలా
మొదటిగా మోగి ఊరంతా వినిపించేది
జీవనాధారమైన నా డప్పు మోతలే…!
జీవిత పరమార్థం చూపవయ్యా శివయ్యా!




కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Excellent poetry 🙏