సుప్రభాత కవిత : - బృంద
లోయల లోతున ఒంటరిగా 
కోనల మధ్యన నిర్భయంగా 
ఎత్తులు దిగుతూ ఉత్సాహంగా 
పల్లము వైపు పరుగిడు ప్రవాహము

వంపుల దారిని వయ్యారంగా 
సొంపుగ  మెలికలు తిరగంగా
ఇంపుగ మోగే గలగల సడులు
ఇరుగట్లను తాకుతూ మోగంగా..

పచ్చని కనుమలు ఆనందంగా 
విచ్చిన కనులతో అబ్బురంగా 
వచ్చే వాగును కన్నులవిందుగా 
మెచ్చి చూసేనట అనురాగంగా..

స్వేచ్ఛగా ఆడుతు పాడుతూ
ముచ్చటగా తిరిగే ముద్దుపాపలా
పచ్చని చీర కట్టిన ప్రకృతి కన్య
కుచ్చిళ్ళలా హొయలు పోవంగా

నింగిని సాగే మబ్బులు కూడా 
నిలిచి చూసే సొగసు ఇది 
వంగి చేరువగా  చేయి కలప
పిలిచే నెయ్యపు పిలుపు అది

చకచక సాగే సెలయేటికి
గతులు నేర్పిన గురువేది?
కడలి చేరే గమనంలో
దరికి చేరే వాగుల పేరేది?

ఆశల తడియారని ఆరాటంతో
అలుపులేని ఆత్రాలతో
చెమ్మ లేని మరీచికల వెదుకుతూ
అలుపెరగక చేసే పోరాటమే జీవితం

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు