రాష్ట్ర వ్యాప్తంగా సబ్జెక్టు ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ అమలు జరుగుతున్న నేపథ్యంలో నిన్న రిలీవింగ్స్ నేడు జోయినింగ్స్ జరుగుతున్నాయి. స్థానిక మండల విద్యాశాఖా కార్యాలయంలో మండల విద్యాశాఖాధికారులు అరసాడ రవి, ముల్లు శ్రీనివాసరావులు బదిలీపై వచ్చిన పలువురు ఉపాధ్యాయులకు ఈ మండలంలో నియామకపత్రాలు అందజేసారు. కొత్తూరు మండలం కడుము ఉన్నత పాఠశాల నుండి సాంఘిక శాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావు బదిలీపై వచ్చి, ఈ మండలం పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలకు నియామకం పొందారు. అలాగే బొడ్డేపల్లి రమణమూర్తి, సదాశివుని రవి తదితరులు పదిహేను మందికి పైబడి నియామక ఉత్తర్వులు పొంది వారి వారి విధుల్లో చేరారు.
అమలవుతన్న బదిలీల ప్రక్రియ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి