కృష్ణలీలలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 కృష్ణుడు 8మందిని పెళ్లాడాడు.దాని అంతరార్థం ఏమంటే పంచేంద్రియములు మనోబుద్ధి అహంకారంలపై దైవం ఆధిపత్యం.రుక్మిణి,సత్యభామ,జాంబవతి ని గూర్చి అందరికీ తెలుసు.ఇక నాల్గవభార్య కాళింది. ఆమె సూర్యుని కుమార్తె.ఒకరోజు అర్జునుడు కృష్ణుడు వేటాడి అలసిపోయి యమున నదిలో మంచినీరు తాగారు.యమునానదిలోంచి ఓయువతి బైటకి వచ్చి పచార్లు చేస్తోంది.అప్పుడు అర్జునుడు  ఆమెని గూర్చిన సమాచారం అడిగాడు."యమున నదికొచ్చి కృష్ణుడు మంచినీరు తాగుతాడు.ఆయన నిన్ను పెళ్లాడతాడు అని మా నాన్న చెప్పాడు అప్పుడు కృష్ణుడు ఈమె నీ నాలుగవ భార్య స్వీకరించాడు ఇక కృష్ణుని ఐదవ భార్య మిత్ర విందా ఈమె ఆయన మేనత్త అయిన రాజాధి దేవి కూతురు అవంతి రా కుమార్తె ఈమె అన్నలు విందానవిందలు చెల్లెల్ని దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు కానీ కృష్ణుడు వారిని చంపి మేనత్త కూతుర్ని మిత్రవిందను పెళ్లాడాడు ఇక ఆరవ భార్య కోసల దేశ రా కుమార్తె నాగ్నజితి ఈమె తండ్రి నగ్నజిత్తు ఏడవ భార్య కేకయ దేశపు రా కుమార్తె భద్ర ఎనిమిదవ భార్య మద్రాదేశపు రాకుమారి లక్షణ మనం లౌకిక దృష్టితో కృష్ణుడు ఇంత మందిని పెళ్లి చేసుకున్నాడు అని దక్షిణ నాయకుడుగా భావించటం తప్పు మన పంచ తత్వాలు మనసు బుద్ధి అహంకారాలు భార్య భార్య రూపంలో చెప్పబడింది అంటే సాధకుడు అన్ని రకాలుగా చిత్తాన్ని మనసుని అహంకారాన్ని అదుపులో ఉంచుకోవాలి లౌకిక దృష్టితో భార్యాభర్తల సంబంధం గా భాగవతాన్ని చూడరాదు🌹
కామెంట్‌లు