ఆ కన్నీళ్లను తుడవలేను :- నామ వెంకటేశ్వర్లు స్కూ. అ జి. ప. ఉ. పా. అయిటిపాముల

  కవి రచయిత కస్తూరి ప్రభాకర్  రాసిన కవితా సంకలనం మట్టి కాళ్ళ ముట్టడిలో ఆ కన్నీళ్లను తుడవలేను అనే కవితలో క వి గారు బడికి వచ్చే పిల్లలలో గల ఆర్థిక అంతరాలను,  మనోవేదన ను చాలా చక్కగా వివరించారు. పాఠశాలకు వచే పిల్లలలో  అబ్బాయిలు అబ్బాయిలు అందులో అందరూ ఎక్కువమంది పేదలు.  కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనివారు ఎక్కువ. ఒక పూట కూడా తిండి లేనటువంటి వారు మరికొందరు  అయినా  పాఠశాలకు వచ్చి ఏదో ఒకటి నేర్చుకోవాలని ఆశ ఆకాంక్షతో వస్తుంటారు. వీరిని గుర్తించినటువంటి ఉపాధ్యాయుడు వారి దుఃఖానికి కారణాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోయాను అని తన అర్థతను ప్రకటించారు కవిగారు.వారు చదవనంతమాత్రాన  వారి పరిస్థితిని తెలిసిన ఉపాధ్యాయుడుగా కోపగించలేను కొట్టి మూర్ఖంగా ప్రవర్తించలేనని తన మానసిక ప్రవర్తనను వివరించారు. ఇది చట్టం ఉందని భయపడి చేసింది కాదు నిజమైన ఉపాధ్యాయుని మానసిక ప్రవర్తన అని చెప్పవచ్చు, ఇలాంటి పరిస్థితి మా స్కూల్లో కూడా నేను 22 సంవత్సరాల నుంచి గమనిస్తూనే ఉన్నాను, కొందరు పిల్లలు తిని రారు ఎందుకంటే అప్పటికి వాళ్ళ ఇంట్లో వంట అనేది ఉండదు, కొంతమందికి వంట చేసి ఉన్నా కూడా వారి ఇంటి కుటుంబ పరిస్థితులు అంటే అమ్మానాన్న మధ్యతగాదాలు అని, కొందరికి అమ్మ ఉంటే నాన్న ఉండడు, నాన్న ఉంటే అమ్మ ఉండదు.  ఎంతోమంది పిల్లను నేను గమనించాను, అప్పుడు అవసరమైతే వారికి టిఫిన్ గానీ బిస్కెట్ గాని తెప్పించి ఇచ్చేవాన్ని, ఇది  నిజమైన ఉపాధ్యాయుని యొక్క ఆలోచన, ప్రవర్తన,లక్షణాలు అని చెప్పవచ్చు, కానీ కొంతమంది పిల్లల గురించి పట్టించుకోని ఉపాధ్యాయులను కూడా నేను గమనించాను. అయినా వారికి అక్షరాలు నేర్పిస్తాను అన్నారు. వారి  కన్నీళ్ళకు కారణాలు మా హృదయాన్ని ద్రవించి వేశాయని కవి గారు తెలియపరిచారు. అలా అనడం ఒక మానవత్వం ఉన్న మనిషి యొక్క ప్రవర్తన అని చెప్పవచ్చు. ఒకవైపు కడుపు కాలుతున్నా వారు బడికి వస్తున్నారు నేర్చుకుంటున్నారు దీనిని బట్టి వారికి చదువు పట్ల ఉన్నటువంటి శ్రద్ద, దీక్ష, ఏదో కొంత జ్ఞానం నేర్చుకోవాలి అనే తపన వారిలో కనిపిస్తుంది. ఉపాధ్యాయుడంటే చదువు చెప్పడమే కాదు పిల్లల యొక్క మానసిక ఆర్థిక, సామాజిక స్థితిగతులను  తెలుసుకొని బోధించే వాడే నిజమైన ఉపాధ్యాయుడని ఈ కవిత ద్వారా తెలిసింది.
   

కామెంట్‌లు