మనిషి మాయం అవ్వలేదు చీకటి కమ్మింది అంతే.
గోపురాలు మేఘాలై ఆకాశమంత విస్తరిస్తున్నాయి.
అడవిని పులులు సింహాలు రక్షించినాయి
భాగ్యం బంగారుగనుల్లో ఉంది.!!
యుద్ధం నినాదాలు సమావేశాల్లో లేదు
సంపదలో ఉంది.
ఊపిరి పీల్చిన గాలి గమ్మత్తుగా మత్తుమందుగా మారింది.
తలల్ని ఖండించిన చూపు తుమ్మెద కళ్ళల్లో ఉంది.
రక్తం గడ్డ కట్టిన విముక్తి శక్తి పుట్టింది.
మగత నిద్రలో మనుషులు మారువేషాల్లో తిరుగుతున్నారు.
చిట్లిన నిజం ముక్కలు మొక్కల్లా నిలబడ్డాయి.
అదిరిన గుండెల్లో రక్తం అదృశ్యమైంది.
ఆకలిగా లేదని పులి నిద్రలోకి జారితే ఆహారం అందంగా ముస్తాబై అడవిలో తిరుగుతుంది.!!
ఎదురుపడిన పొద్దును ఎదుర్కొనే చీకటి రేపటి కోసం తప్పించుకుంది.
ఉడుమును మింగిన పెద్ద పాము కోటపైకి పాకుతుంది.
ధరీ దద్దరిల్లింది అలల పోటులకు కాదు నేల గుండె పగిలి కుమిలిపోతున్నందుకు.!!
కుదురు కుండ పై కండబలం చూపితే నిండుకుండ తొలకింది.
ఎగిరే పక్షి కలగంది సూర్యాస్తమయాలు ఆగిపోతాయని.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి