ఓ సాగరమా నీకు వందనం..:- కోరాడ నరసింహా రావు !

 (సముద్ర దినోత్సవం)

   ******
గంభీరము నకు మెండైన పోలిక సాగరమ్ము !
  లెక్క లేనన్ని జల చరములకు ఆవాసమీ కడలి...!
   ఈ భూ గోళమును మూ డు వంతులు ఆక్రమించినదీ జలనిధి !
     దేశములెన్నిటికో అను సంధాన కర్త యైనదీ జలధి !
   ఇది సప్త సముద్రములుగా పేరు గాంచినది !
    గంగ పుత్రులకిది జీవనో పాది!
  వివిధ దేశాల మధ్య వ్యాపారములకును ,రాకపోకలకు జల మార్గ మాయెను !
    కిరోసిన్,పెట్రోలు... డీజిల్, క్రూడాయిలు ల నిక్షిప్తనిధి ఈ సముద్రమ్ము!!
జల విద్యుత్తు నకు గొప్ప ఉత్పత్తి కేంద్రము!
   ఎన్నొ విలువైన సంపదల నిలయమీ సంద్రము !
    పాల సముద్రము, నీలిసంద్రము ,ఎర్ర సముద్రము ... ఎన్నెన్ని వన్నె లున్నవి దీనికి !!
  అమృతము ,విషము,లక్ష్మి,చంద్రుడు, అశ్వము,గజము మొదలుగా ఉద్భవించినవీ కడలి నుండే !!
 పడి లేచు కెరటముల సోయగముతో...
  తన చెంతకు రప్పించుకొని ,ఆనందమును పంచు బీచు లెన్ని టితోనో ...
  అలరారు చున్నవీ సాగర తీరము లన్నీ!
    కవులకు కవితా వస్తువు , ప్రేమికులకు ప్రణయ కేంద్రము ఈ సాగర తీరము !!
  ఇన్ని ప్రత్యేకతలున్న 
ఓ సాగరమా....
  నీకు శత కోటి వందనములు...!!
🙏💐🙏🌷🙏💐🙏
కామెంట్‌లు