అప్పట్లోనే..!!:- - యామిజాల జగదీశ్
 నమ్మలేని నిజం... పురాతన గ్రీస్‌లో రెండు వేల  సంవత్సరాల క్రితం  "వెండింగ్ మెషీన్లు" వంటివి ఉండేవి.
అలెగ్జాండ్రియాకు చెందిన ఓ తెలివైన ఇంజనీర్ హెరాన్ దేవాలయాలలో  ఏర్పాటు చేసిన యాంత్రిక పరికరం అందరినీ ఆశ్చర్యపరిచింది. 
ఒక నాణాన్ని అందులోకి విసిరితే, ఆ మిషీన్ పనిచేయడం ప్రారంభిస్తుంది. పైగా పవిత్ర జలాన్నిచ్చేది.
నాటి కాలంలో   ప్రజలను ఈ మాయా సాంకేతికత ఎంతగొనో ఆకట్టుకుంది.
అది ఒక ఆధునిక ఆవిష్కరణలా చరిత్ర పుటలకెక్కింది. మనమిప్పుడు చెప్పుకునే ఆధునిక పరికరాలన్నీ వాస్తవానికి పురాతన మూలాలను కలిగి ఉన్నాయి. కనీక నిజమైన ఆవిష్కరణ ఎల్లప్పుడూ కొత్తగా ఉండనవసరం లేదు, ఎందుకంటే వాటి మూలాలు తరచుగా గతంలో ఎక్కడో అక్కడ ఉండే ఉంటుంది. అది తెలుసుకోవాలంటే చరిత్ర పుటలను ఓపికతో తిరగేయాలి. అప్పుడు వాటి మూలాలు రుజువవుతాయి.
అందుకే పూర్వ సంస్కృతుల చాతుర్యం, సృజనాత్మకత నేటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.

కామెంట్‌లు