సుప్రభాత కవిత : - బృంద
ఆకాశమంత ఆనందమంటే 
హాయిగా నవ్వే పువ్వుదేగా!

అవధే లేని సంతోషమంటే 
పువ్వుల నవ్వుల తోటదేగా!

ఎల్లలు ఎరుగని నెయ్యమంటే 
చల్లగ పాకే పరిమళముదేగా!

స్వార్ధం లేని జీవితమంటే
అర్థం కుసుమపు బ్రతుకేగా!

భువిని రంగుల మయం చేసే
వరం విరిసే సుమవనాలదేగా!

గాలి పల్లకిలో ఉరేగే అతిశయం
తేలే  కమ్మని సుమ గంధానిదేగా!

చుక్కలుగా దాచిన మకరందం 
మక్కువగా  పంచే గుణం పూలదేగా!

తుమ్మెద పాటల మైమరచి 
రమ్మని పిలిచే పిలుపు విరులదేగా!

కొలతే లేని సౌందర్యాలు
కొదవే లేని  సరాగాలు....

వెరపే లేని  విలాసాలు
తెరిపే లేని వినోదాలు...

మరపే రాని విహారాలు
గరపే సుందర సుమవనాలు

వనమంటి జగతిలో
మనమంతా కుసుమాలం

చిన్నదైనా జీవితాన్ని
మిన్నగా  జీవించాలని
తిన్నగా తెలుపుతూ 
వన్నె నింపుతూ సాగమంటూ..

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు