నా పాఠశాల":- డా. మురహరరావు ఉమాగాంధి
వదిలేసి వచ్చేశాను..
బాల్యం లోకి వెళ్ళి ఆటలు ఆడుకున్న..
 నా శివాజీ పాలెం బడిని..
పదిహేనేళ్ళు నా కాలి ముద్రలు ముద్దాడిన దారుల్ని,.
భజనలతో నిత్య పూజలు అందుకునేటి  చదువుల తల్లిని...
నా జ్ఞాపకాలను మోస్తూ మురిసిపోతున్న పిల్లల్ని...
వదిలేసి వచ్చేశాను..!

అక్కడే కదూ!
బయట గట్టుపై కూర్చొని పిల్లలతో  కథలు చెప్పింది..

అక్కడే కదూ...!
ఆట పాటల విద్యతో భగవద్గీతను నేర్పింది..

అక్కడే కదూ..!
నృత్యాలు నాటికలు యోగ సాధనలు అలరారింది

అక్కడే కదూ..!
చెట్ల కింద కూర్చొని పక్షుల గానాలకు మురిసింది...

అక్కడే కదూ..!
మట్టి వినాయకుని చేసి, పూజకు పత్రాలు కోసింది..

అక్కడే కదూ.. ¡
నేలపై నడయాడే గురువుల్ని కలిసింది..

అక్కడే కదూ..!
బంగారు పతకంతో డాక్టరేట్ పూర్తి చేసింది..

అక్కడే కదూ..!
పుస్తకాలు రాసేంత సాహిత్యం అబ్బింది...

అక్కడే కదూ..!
నా సొంతింటి కలతో,జీవన కళ నెరవేర్చింది...

అక్కడే కదూ.. ¡
నా ఇరువురి సంతానానికి వివాహం చేసింది..

అక్కడే కదూ..!
జిల్లా, రాష్ట్ర,జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది..

అక్కడే కదూ..!
ఇప్పటికీ నా ప్రాణం కొట్టాడింది..
నా పాఠశాలకు దూరంగా..
ఆత్మ లేని శరీరంలా...
 ఇప్పుడు ఇలా మిగిలింది..!😔


కామెంట్‌లు