కదలని చెట్టు కదిలితే...
కదిలే నది నిలిచిపోతే...
క్షణం ముందు కనిపించిన
మనిషి... మరుక్షణం
కళ్లకే కనిపించక మాయమైపోతే..?
తిరిగిరాని లోకాలకు తరలిపోతే..?
రేపొస్తానని చెప్పి,పచ్చిమాన
అస్తమించిన సూర్యుడు...
మరునాడు
తూర్పుతలుపు తట్టకపోతే..?
ఏమౌతుంది..?
యుగాంతమే కదా అది..!
సృష్టి సమస్తం
సమాప్తమౌతుంది
సంక్షోభ తుఫానుల్లో
చిక్కుకు పోతుంది...!
ఔను సూర్య చంద్రులులేని
సృష్టిని ఉహించుట అసాధ్యమే.!
ఔరా అది అత్యంత భయానకమే..!
అది మానవ జాతికి మరణశాసనమే..!
అది పంచభూతాల నిర్ధయ నిర్ణయమే..!
అది ప్రకృతి జడ్జి ఇచ్చే నిశ్శబ్దపు తీర్పే...!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి