సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో పోలయ్య కవి కూకట్లపల్లికి సాహితీ సత్కారం..
ఇటీవల కస్తూరి విజయం ఇంక్ బౌండ్ బుక్ పబ్లిషర్స్ ఆధ్వర్యంలో...సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో... నందమూరి ప్రాంగణంలో...తెనాలి వాస్తవ్యులు కవి 
రచయిత దాత నూతలపాటి నాగేశ్వరరావు సంపాదకత్వంలో...86 మంది కవులు కవయిత్రులు వ్రాసిన "కవితా కెరటాలు"... 
"కథల పరిమళాలు"...అను రెండు పుస్తకాలను కస్తూరి విజయం వ్యవస్థాపకులు పామిరెడ్డి సుధీర్ రెడ్డి వారి భాగస్వామితో కలిసి ఆవిష్కరించారు.

తదనంతరం కవులందరిని
ఉచిత రీతిలో సత్కరించారు...
ఈ సభకు హాజరైన ప్రముఖ కవి 
రచయిత హైదరాబాద్ నివాసి 
పోలయ్య కవి కూకట్లపల్లి మాట్లాడుతూ నాగేశ్వరావు సంపాదకత్వంలో వచ్చిన 
"కవితా కెరటాలు" సంపుటిలో..."భారత నారీ...కార్మికుల హక్కులను కాలరాస్తే...
ఆయుధాలు"...అను తాను వ్రాసిన మూడు కవితలకు..."కథల పరిమళాలు" పుస్తకంలో "గోవిందా...గోవిందా" అను ఒక హాస్య కథకు 
చోటు దక్కిందని అందుకు నూతలపాటి నాగేశ్వరరావుకు "కూకట్లపల్లి పోలయ్య కృతజ్ఞతలు" తెలియజేశారు ఎంతో 
సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

ఈ సభలో తోటి కవులతో పాటుగా 
"రెండు ఉచిత పుస్తకాలు...ఒక శాలువా...
ఒక సర్టిఫికెట్" తో తనను ఘనంగా సత్కరించిన...కస్తూరి విజయం
వారికి...నూతలపాటి నాగేశ్వరావుకు 
కవి పోలయ్య కూకట్లపల్లి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సభలో "మరణం లేని మహానటుడు 
మా నందమూరి చందమామ" అను 
ఎన్టీఆర్ కవితను చదివి పోలయ్య కవి 
సభను అలరించారు అన్న అభిమానుల 
ప్రశంసలను పొందారు... 

దాదాపుగా ఒక వందమంది కవులు
కవయిత్రులు హాజరైన ఈ సభ కవుల
 మనసు నిండగా కనుల పండుగలా 
దిగ్విజయంగా ముగిసింది.

కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం