ప్రపంచాన్ని మార్చేయగలదు:- డాక్టర్ సి వసుంధర చెన్నై
ఆయుధం 
యుద్ధ పరికరం 
ఒక్కఅక్షరం ఇనుమునైనా
 ముక్కలుగా మార్చగల మహోగ్ర ఆయుధం. 
 
విప్లవ కవిత్వాలు  
 చెరుగుతాయి  
నిప్పులను.
 తప్పు లను ఎత్తిచూపే 
  కత్తిలాంటి అక్షరాలతో
కవుల కలాల నుండి
కదిలే ప్రతి అక్షరం 
వదిలిస్తుంది మత్తు 
కలిగిస్తుంది  కొత్త  గమ్మత్తు.

హృదయాలకు హత్తుకునే 
ఒక్క మాట చాలు, 
పదిలంగా దాచుకొని 
ధనమై, మురిపిస్తుంది
 మన్మధునిఆయుధమై అనుభవాల పందిరిపై
సుందర పుష్పాలు పూయిస్తుంది.
ఏ రసాయన్నయినా
సృష్టించే గొప్పవిద్య
అక్షరానికి కరతలా మలకం.
 అక్షర బ్రహ్మ సురక్షితంగా ప్రపంచమంతా వర్ధిల్లాలి. 
కవుల కలాలకు బలాన్ని చేకూరుస్తూ వజ్రాయుధమై, 
మన్మధుని పుష్పా యుధమై వర్ధిల్లాలి.

కామెంట్‌లు