మెట్టూరు స్కూల్ కి ట్రిపుల్ ఐటీ సీట్ల పంట




 నేడు విడుదలైన ఆర్.జి.యూ.కె.టి ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో, మెట్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ఐదుగురు విద్యార్థులు ఎంపికైనట్లు డి.ఎల్.నరసింహం తెలిపారు.
ఒంగోలు ట్రిపుల్ ఐటి లో యస్.లోకేష్, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటిలో టి.ఉదయకుమార్, నూజివీడు ట్రిపుల్ ఐటిలో
బి.హరిణి, యల్.లావణ్య,
జె.శ్రావ్యలు సీట్లు సాధించారు.
సాధారణ వ్యవసాయ కూలీ కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులు ఇంతటి ఘనత సాధించడం విశేషం. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దూసి లక్ష్మీ నసింహం, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ జె.భానుమూర్తి, సహోపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులు, తదితరులు విద్యార్థులను అభినందించారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు