సాహితీ కవి కళాపీఠం
సాహితీ కెరటాలు
==============
కళ్ళకపట మెరుగని కవ్వింతలే అన్ని
కనుచూపు సైగలమాటున చిలిపి నవ్వులే అన్ని
ఉత్తరాల మాటున ప్రేమలేఖలే కొన్ని
పరవసించే కన్నె వయసులో కవ్వింతలే కొన్ని
తొలిప్రేమ , తొలివలపు, తుది వరకు చెరగని జ్ఞాపకం ఒకరికి
చేదు జ్ఞాపకం మరొకరికి
ముచ్చటిస్తూ, మన్నిస్తూ, మమకారాన్ని పంచుకుంటూ
దోబూచులాటల మధ్య ధైర్యంగా తిరిగిన రోజులెన్నో
ఒకరి కోసం ఒకరు నిలబడిన క్షణాలు ఎన్నో
ఎదిరించి, సాహసించి, ప్రేమ కోసం ప్రేమనే వదులుకున్న ప్రేమ జంటలు ఇంకెన్నో
భవిష్యత్తుకై కళలు కని
కనుమరుగైన వారి జ్ఞాపకాలతో ఊహల్లో బ్రతికే మనసులు ఇంకేన్నో
****
బా ను అమ్మ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి