శాస్త్రజ్ఞులు కొందరు కాఠ్మాండుకెళ్లి
హిమ జల శిఖరాలను సందర్శించి
50 ఏళ్ల శిఖర పరిమాణాలు పోల్చగా
ఇప్పటి పరిమాణం 66% తరిగిపోయింది
మనమంతా భూతాప పెరుగుదలను
ఆపుటకు ప్రయత్నించాలి అందరూ
ఎదిగిన చెట్లను నరికేసి
భూతాపం పెంచిన మనుషులు
నేటి పిల్లల్లారా మీరంతా
చిట్టి చేతులతో మొక్కలు నాటండి
అవని తల్లికి పచ్చల హారం వేసి
జీవకోటికి ప్రాణవాయువు ఇవ్వండి
వాయు కాలుష్యం తగ్గించండి
వనరుగా వనములు పెంచండి
హిమాలయాల శిఖరాలు కాపాడి
వచ్చే ముప్పు నుండి రక్షించండి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి