సాహితీ కవి కళాపీఠం,
సాహితీ కెరటాలు,
==============
జీవితం — ఓ అనుభవ పాఠశాల;
జీవనం — ఓ ఒరవడి.
తల్లి ప్రేమతో అంకురించి,
తండ్రి మమకారంతో చిగురించి,
పాఠశాలనే సమాజంలో జ్ఞానాన్ని పొంది,
తన కోసమే కాక —
పరుల హితం కోసం,
సమాజాభివృద్ధి కోసం,
"పచ్చని తివాచీని పరచాలనే" లక్ష్యంతో,
వెనుతిరగక, ముందుకు సాగుతున్న సగటు మనిషి — అతను.
దయ, క్షమ, ప్రేమ, ఓర్మి, సహకారం —
అతని గుణాలు.
పలుకులో సత్యం,
పనిలో జయం,
సలహాలో విజయం —
అతని నైజాలు.
అతని వెలుగులు —
ఉషోదయ ప్రకాశం,
అతని ఆకాంక్ష —
శుక్లపక్ష చంద్రిక,
అతని సలహా —
చిగురిస్తున్న వసంతం.
అతని వాక్కు —
బ్రహ్మ వాక్కు.
అతని నిర్దేశం —
అంతరించే చీకటి.
అతని లక్ష్యం —
పులకరించే పృథ్వి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి