పోలన్న కవి సూక్తిసుధ...:- పోలయ్య కవి కూకట్లపల్లి హైదరాబాద్
మనది కానిది మనకు
"దక్కాలనుకోవడం"... ధర్మమా..?

మనకు దూరమై దుఃఖాన్ని 
మిగిల్చింది మళ్ళీ మనకు
"చిక్కాలనుకోవడం"...న్యాయమా..?  

అర్హత లేకుండా 
మనం సింహాసనం
"ఎక్కాలనుకోవడం"...భావ్యమా..? 

కంటికి కనిపించిన 
ప్రతిరాయిని దైవమని 
"మ్రొక్కాలను కోవడం"...
ఏం భక్తి..?ఎలా దొరుకుతుంది ముక్తి..?


కామెంట్‌లు