బిడ్డలకోసం బ్రతికే వాడే:- కోరాడ నరసింహా రావు
ఫాదర్స్ డే కవిత....!
        *****
  బరువు,బాధ్యతలు చక్కగా నెరవేర్చినపుడే...
కన్నతండ్రి కి విలువ, 
గౌరవాలు...!

కని,బిడ్డల బాగోగులను పట్టించు కొనక ... వ్యసనాలకుబానిసయై...
 ఆలు బిడ్డలను గాలికి వదిలేసినవాడు...వాడు తండ్రి ఎలా కాగలుతాడు !?

బిడ్డలు బాగాచదివి మంచి భవిష్యత్తును నిర్మించుకోవలసిన వయసులో... వాళ్లను బాల కార్మికులను చేసి...
తను చేసిన అప్పులను వారి నెత్తిపై రుద్ది....,
   ఇవి చాలవన్నట్టు ఆడపిల్లల బరువు, బాధ్యతలనూ ఆ లేత ప్రాయపు కొడుకుల నెత్తిపై మోపి చేతులు దులిపేసుకుంటున్న తండ్రులు,వారు తండ్రులా..!?

తండ్రంటే ఇంటికి పెద్ద !
  భార్యా బిడ్డలను కంటికి రెప్పలా కాచుకోవలసినవ్యక్తి !!
  తన కుటుంబము కోసమే 
ఆహారహమూ పరిశ్రమించేవాడు !
  తనబాధ్యతలను కర్తవ్య నిష్ఠ తో నిర్వర్తించవలసినవాడు !!

బిడ్డల భవిష్యత్తుకోసం పరితపించేవాడే తండ్రి ! 
  వాళ్ళ అభివృద్ధిని చూసి మురిసిపోయాడే నిజమైన తండ్రి !!

తానె న్ని బాధలు పడుతున్నా... తనబిడ్డలు ఎలాంటి బాధలూ పడకూడదని పాటుపడే వాడే నిజమైన తండ్రి..!!

అలాంటి తండ్రులందరికీ...
శిరసువంచి పాదాభి వందనములు💐🙏🌷🙏💐🙏

కామెంట్‌లు