గాంధేయవాదికి నా అక్షరనివాళి:- కవిమిత్ర, సాహిత్యరత్నఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి) విశాఖపట్నం.
 శాంతి అహింసలే విజయానికి సోపానాలన్న
మాహాత్ముని భావాలను జీవితాంతం ఆచరించి
కాదేది వయస్సుకు అనర్హం అని
నేటి సమాజాన యువతకు గాంధీ జీవితం ఆదర్శమని
డెబ్బది ఎనిమిదో ఏట మాహాత్మునిపై
"పర్షప్షన్స్ ఆఫ్ స్టూడెంట్ యూత్ ఆన్ మహాత్మా గాంధీ" అనే అంశంకు
ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి
డాక్టరేట్ పొందిన  డాక్టర్ రావిప్రోలు సుబ్రహ్మణ్యం గారు
కోరమాండల్ ఫెర్టిలైజర్స్ లో ఉద్యోగం చేసినా
సాహితీవేత్త రచయిత
గాన గంధర్వులు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం కు బాల్య స్నేహితులు
మహాత్ముడు సత్యాగ్రహం చేసిన నెల్లూరుజిల్లాలోని
పల్లెపాడు పినాకిని ఆశ్రమంలో
గాంధీ జయంతిని నిర్వహించి
మాహాత్ముని పై కవితా సంకలనాన్ని 
కవులచే వ్రాయించి
ఎప్పుడు ఆప్యాయంగా  బాగున్నారా అని పిలిచే అగ్రజులు
 మాహాత్ముని సంకలనంలో నన్ను  భాగస్వామిని చేసి
నేను అమెరికానుంచి వచ్చిన తరువాత
అభిమానంగా  ప్రేమతో  నా కందించిన ప్రేమమూర్తి
మీ నాన్నగారు మహాత్మునిచూసిన మహాసనీయులు
మీరు సనాతన ధర్మానికి ప్రతీకయని
కరోనాలో కూడా ఫోన్ లో మాట్లాడే అగ్రజులు
అకస్మాత్తుగా  శ్రీరామచంద్రుని దరి చేరడం
ఎనిమిది పదుల వయస్సు లో  విశాఖపట్నంకి
ముఖ్యంగా నాకు తీరనిలోటు
"జాతస్యహి ధృవో మృత్యు: "
విధిబలీయం 
ఆఖరిశ్వాస వరకు గాంధేయ వాదిగా నిలచిన
అగ్రజునికి నే ఆర్ధ్రతతో సమర్పిస్తున్న అక్షర నివాళి..!!
(ప్రముఖ గాంధేయవాది ,రచయిత  అగ్రజులు డాక్టర్ రావిప్రోలు సుబ్రహ్మణ్యం గారు శ్రీరామచంద్రుని దరి చేరారని తెలిసి ఆర్ద్రతతో వ్రాసినది)
.............................
........................

కామెంట్‌లు