మహా మహా నగరాలు
కాలుష్యపు కోరల్లో బందీలు
ప్రశాంతతకు నిలయమై
స్వేచ్ఛా వాయువులకు వాసియైన
పల్లెల పరిస్థితీ మారె
అడ్డూ అదుపూ లేని జనాభా
రకరకాల కాలుష్యమూ పెరిగె
పెరుగుతున్న చెత్తకుప్పలూ
భరించలేక కాల్చుతున్న జనం
వాయు కాలుష్యంలో చిక్కి
దీర్ఘకాలిక వ్యాధిగ్రష్తులై
అల్పాయుష్కులవుతున్నారు
మేల్కొనకపొతే మనం
మరిన్ని ఢిల్లీలను చూస్తాం
పెరుగుతున్న స్వార్థం, సోమరితనం
అందరి ఆరోగ్యాలకూ పెనుశాపం
ఇకనైనా మేల్కొందాం మనం
బాధ్యతను తెలుసుకుందాం
ప్లాస్టిక్కును పూర్తిగా నిషేధిద్దాం
జనావాస సమీపాల్లో
చెత్తను కాల్చడం ఆపేద్దాం
జాగృతమవుదాం మనం
ఆరోగ్యంగా జీవిద్దాం అందరం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి