ఎదురుచూపు!!:-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం
ఏదైనా 
వస్తుందో రాదో అని 
ఎదురుచూస్తాం!!

ఏదైనా 
వస్తుందంటే 
వేచి ఉంటాం!!

ఎదురుచూపు 
స్వర్గం! 
వేచి ఉండటం 
నరకం!!

ఎదురుచూపు ప్రేమ 
వేచి ఉండటం ద్వేషం 

ఎదురుచూపు సంస్కారం 
వేచి ఉండటం క్రూరం 

ఎదురు చూడటం సహనం!
వేచి ఉండటం అసహనం!!

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.

కామెంట్‌లు