సంపత్కారకం సిరిమానోత్సవం:- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.- హైదారాబాద్.

 విద్యలకు నిలయమైన
విజయనగరంలో
ఉత్తరాంధ్రకే ఇలవేలుపు అయిన
కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి ఆయిన
పైడితల్లమ్మ  ఉత్సవాలలో
సిరిమానోత్సవ  జాతర
ఆంధ్ర రాష్ట్రానికే  కాదు
దేశంలోనే అతి పెద్దజాతర
ఆశ్వయుజ మాస దశమి తరువాత వచ్చే మంగళవారం
పైడితల్లమ్మ జాతర మహిమాన్వితమైనది
అమ్మవారి పూజారి కలలో
పైడి తల్లమ్మ కన్పించి
పూజకు అర్హమైన చెట్టు ఎక్కడుందో చెబితే
దానిని తీసుకుని భక్తి శ్రద్దలతో
ఉత్తరాంధ్రప్రజలు అమ్మవారి ప్రతిరూపంగా భావించి
పూజారి సిరిమాను ను అధిరోహించి
అంజలి రథం, తెల్లని ఏనుగు, పాలధార, జాలరి వల ముందు నడువ
విజయనగర గజపతుల కోటవరకు
అంగరంగ వైభవంగా సాగే విభిన్న వేషధారణ తో
నృత్యాలతో 
జై పైడిమాంబ జై పైడిమాంబ అని సిరిమాను పై ఉన్న పూజరిపై
అరటిపండ్లను విసురుతు  
కోటపై ఆశీనులైన గజపతుల దర్శనం
'న భూతో న భవిష్యతి'
అమ్మవారిని పసుపు నైవేద్యంగా
చీర, గాజు గాజులను సమర్పించిన
సౌభాగ్య సంపద సంతానాన్ని  కలుగు చేసె
కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి
శుభములను కూర్చు వరదాయని
పైడితల్లమ్మ  సిరిమానోత్సవం సంపత్కారకం
జీవన్ముక్తి కి సోపానం.!!
...............................

కామెంట్‌లు