నిజాయితీ:- ధరావత్ ప్రియంక-8వ తరగతి- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘణపూర్- మెదక్ జిల్లా-9347154330
  అనగనగా రత్నగిరి ఆనే రాజ్యాన్ని విజయుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. చాలా అనారోగ్యంతో ఉండడం మూలంగా తనకు పిల్లలు లేనందువలన తన స్థానంలో రాజుగా ప్రజలలో ఒకరిని ఎన్నుకోవాలనుకున్నాడు. ఒకరోజు ప్రజలందరిని పిలిచి, తన వద్దనున్న విత్తనాలను అందరికీ పంచి, నెల రోజుల తర్వాత మొక్కలు చేసి తీసుకరమ్మన్నాడు.
              నెల రోజులు గడిచింది. ప్రజలందరూ మొక్కలతో వచ్చారు. అందులో సోము అనే వ్యక్తి ఖాళీ కుండతో వచ్చాడు. ఖాళీ కుండతో వచ్చిన సొమును చూసి అందరూ నవ్వారు. రాజు విజయుడు మాత్రం నిజాయితీ కలిగిన సోమును రాజుగా ప్రకటించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు రాజు విజేయుడు మాట్లాడుతూ నేను ఇచ్చిన విత్తనాలన్నీ కూడా పుచ్చిపోయి పాడైనవి. అవి మొలకెత్తవు. అందరూ ఎక్కడివో మొక్కలు తెచ్చారు. ఖాళీ కుండతో నిజాయితీగా వచ్చిన సోమును రాజును చేయడం న్యాయమని, రాజుగా ప్రకటించాడు. ప్రజలు తమ తప్పుకు తలదించుకున్నారు. సోము చక్కటి పాలన చేస్తూ, రాజ్యానికి మంచి పేరు తేసాగాడు.


నీతి: నిజాయితీ ఎప్పుడు గెలిపిస్తుంది.
 


కామెంట్‌లు