సుప్రభాత కవిత : - బృంద
అందమైన అరుణోదయం 
అవనికి అంతులేని సంబరం 
అంశుమాలి  రాకతో 
ఆణువణువూ చైతన్యం

కొండదారిని మొదలుపెట్టి 
నింగిని సాగే ప్రస్థానంతో
నేలమీద వెల్లువలా వెల్లివిరిసే
వేకువ వెలుగుల ప్రసారం

నులివెచ్చగా తాకు 
తొలి కిరణపు స్పర్శకు 
నిలువెల్లా పులకరించి
కనులు తెరచిన పుడమి పుష్పం

అంబరాన సంభవించు
అద్భుత విస్ఫోటనం ధాటికి
ఆవరించె ఆణువణువూ
నిశ్శబ్ద చైతన్యం

ఆశల  పల్లకీలో 
ఆరాటాలు మోసి తెస్తూ
అరుదెంచు ఆదిత్యునికి
అంజలి ఘటిస్తూ..

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు