కరుణ నిండిన కనులకు
కనిపించే ప్రతి అణువు
కనిపించని దైవపు
కమ్మని ప్రతిరూపం.
ఇచ్చినదేదో తిరిగి పొందడమే
ఇలలో జరిగే క్రమం
ప్రేమైనా పగ అయినా
ఏదైనా మన కర్మమే!
అద్దమంటి సరస్సులో
ముందుంచిన ప్రతీది
కచ్చితంగా కనిపించదా
ఉన్నది ఉన్నట్టుగా....
అనిపించే తీరులో
అవకతవకలు జరిగితే
చిన్నరాయి తాకిన తీరున
చిందర వందరేగా జీవితమంతా!
అమాయకంగా అడుగేస్తే
అడుసు మీద కాలు పడితే
అభాసు పాలై అలమటించక
ఆపగలదా అజ్ఞానం?
తపించిన తరుణమొచ్చేసినట్టు
తరుముకొస్తున్న తలంపులలో
తబ్బిబ్బు చేసే తాయిలంతో
తరలివచ్చు వేకువకు
🌸🌸సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి