జీవితమే ప్రశ్నలమయం: - కవి మిత్ర, సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి) -హైదరాబాద్
 పరమాత్ముని కృపచే
పుడమిపై పురిటినొప్పులు పడుతు
పునర్జన్మ నిచ్చిన మాతృమూర్తి హృదయంలో
మొదటి ప్రశ్న పండంటిపసిపాప జన్మించాలని.
ఇరుగు పొరుగు, అత్తమామలు అడిగే ప్రశ్న పుట్టినది ఆడపిల్లా, మగపిల్లడాయని
 మంచి పాఠశాల లో సీటు వస్తోందో రాదో అనేది ప్రశ్న
తదుపరి ఉన్నత చదువులు వస్తాయో రాదో అన్నది ప్రశ్న
డిగ్రీలు వచ్చాక సరిఅయిన ఉద్యోగం కోసం పడే ఆవేదన
ఉద్యోగానంతరం వివాహంలో మంచి భాగస్వామి లభిస్తుందో లేదో అన్నది ప్రశ్న
పిల్లలు పుట్టిన తరువాత ప్రయోజకులవుతారా లేదా అన్న సంశయం
వార్ధక్యం లో జీవితం సక్రమంగా  ఆరోగ్యపరంగా  
కడుపున పుట్టిన పిల్లల చేతుల మీద పరమాత్మ చెంతకు చేరాలన్న ఆవేదన
పండిన పంటకు రాబడి వస్తుందో రాదో అని రైతుపడే భాధ
రాజకీయ నాయకునికి పదవి ఎంతకాలం ఉంటుందోఅన్నది ప్రశ్న
నేడు వసుదైకాన కరోనా నుంచి విముక్తి అవుతామా లేదా అన్నది ప్రశ్న
అందుకే జీవితమే ప్రశ్నలమయం.
ఆదరక,బెదరక నిరంతరసాధనయే
దానికి పరిష్కారం....!!
................................

కామెంట్‌లు
Popular posts