వారు మనలాంటి వారేనని సహాయం చేసినపుడు పొగిడిన వాళ్ళే
నేను పరిస్థితుల ప్రభావం వల్ల సహాయం అడిగితే
ఉన్నప్పుడు ఆలోచించక దానకర్ణుడిలా ప్రవర్తించావు అనుభవించన్నారే..!
నైతిక విలువలతో పెరిగి ఉన్నత చదువులు చదివి
అత్యున్నత స్థితికి చేరినపుడు కీర్తించినవారే
ఎవడో చేసిన తప్పుకు నే కారణమని పదవీత్యుతుడనయితే
వీడెప్పుడు ఇంతే అని ఈసడించుకున్నారే...!!
మొన్న క్రికెట్ లో క్రీడాస్ఫూర్తితో మొదట
అన్ని ఆటలు గెలిచినపుడు అందలమెక్కించి సరిలేరు
మా ఆటగాళ్లకెవ్వరు అని పొగడిన వారే
ఫైనల్ లో ఓడినపుడు
ఎప్పుడు వీళ్ళింతే
దేశాభిమానం లేదన్న వేళ
నేననుకున్నా
సమాజం తీరు ఇంతేనా?.
.............................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి