అంకెలతో బొమ్మలు : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట

ఆడి పాడే పిల్లల్లారా 
ఆడుతు పాడుతు రారండి
అందరు కలిసి చూడండి
ఆరు అంక్య రాయండి

అందమైన బొమ్మను దించండి 
మీరు పరిశీలించి చూడండి
అందులో దాగి ఉంది 
అందమైన పిల్లి బొమ్మ 

పిల్లలు అంతా కలవండి 
మెల్లిగా జమ కూడండి 
ఒక్కటి రెండు రాయండి 
ఓనగుంటలు ఆడండి

మూడు నాలుగు రాయండి 
నీడలు తొక్కుడు ఆడండి 
ఐదు, ఆరు రాయండి 
అందులో బొమ్మను చూడండి 

ఆడుతు పాడుతు మీరంతా
అంకెలు అన్నీ నేర్పండి 
పిచ్చి గీతలు గీయండి
అందులో బొమ్మలు చూడండి


కామెంట్‌లు
Popular posts