మిణుగురంత వెలుగుకోసం
బితుకు మంటూ చూసిన
జగతికి కానుకగా వచ్చెనేమో
తొలి వెలుగు కిరణం
అడలిన మనసులకు
ఆనందహేలగా
అలసిన అడుగులకు
ఆయాసము తీర్చగా....
పలకరింపులో ప్రేమ
అనునయంలో ఆప్యాయత
సహకరించడంలో స్నేహం
ఒకేసారి అర్థమయేలా...
శోధించే వేదనలు
సాధించే కలతలన్నిటినీ
నిరోధించే ఏకైక మంత్రంగా
ఏతెంచె నిదుగో అంశుమాలి
తరిమే కాలపు వేగాన్ని
తమాయించుకోమని
తగిలే గాయపు సెగను
తరిగించే భారం తనదేనని
ఏదైనా ఈ రోజే....
రేపటికి తక్కువేనని
ఆశ జీవనసూత్రంగా
ఆగక అడుగేయమనే....
అరుణోదయ కిరణానికి
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి