'బాల సాహిత్యమే భావి సాహిత్యం' నినాదంతో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో విస్తృతంగా బాల సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ సారస్వత పరిషత్తు మరోసారి మే 4వ తేదీన హైదరాబాదులో బాలసాహిత్య సమ్మేళనం నిర్వహించనుంది.
బాల సాహిత్య రచయితలు, బాల సాహిత్య వికాస కృషిలో పాఠశాల స్థాయిలో విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలుస్తున్న ఉపాధ్యాయులకు మరింత అవగాహన పెంచే విధంగా పలు అంశాలపై సదస్సులు జరుగుతాయి. ఈ సందర్భంగా బాలసాహిత్య వేత్తలు, ఉపాధ్యాయులు అభిప్రాయ వేదికలు ఉంటాయి.
బాల సాహిత్యరంగంలో విశేష కృషిచేసిన రచయితలకు బాల సాహితీ మూర్తి పురస్కారాలు, విద్యార్థులకు స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్న ఉపాధ్యాయులకు బాలసాహితీ మిత్ర పురస్కారాలు అందజేస్తారు. పద్మభూషణ్ డాక్టర్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలోని శాంతా- వసంతా ట్రస్ట్ సౌజన్యం అందిస్తున్న ఈ సమ్మేళనంలో ప్రతినిధులుగా పాల్గొన గోరే బాలసాహిత్య రచయితలు, ఉపాధ్యాయులు ఈ నెల 20 వ తేదీలోగా
9 6 0 3 7 2 7 2 3 4 వాట్సాప్ నెంబర్ లో పేరు నమోదు చేసుకోవచ్చని పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి