కిటికీ: - డా ప్రతాప్ కౌటిళ్యా.
స్వర్గానికి మెట్లు ఉంటాయి 
నరకానికి మెట్లు ఉండవు 
కష్టపడాల్సిందే 
మేఘాల్ని అందుకునే లోపే 
పరుగెత్తుతాయి 
మంచు పర్వతం మౌనంగానే కరుగుతుంది. 
మండిన గుండెలు ఎండమావుల్లా పారుతూనే ఉంటాయి. 
నక్షత్రాల మెరుపుల్లో మొగలి పువ్వులు పూస్తుంటాయి. 
బంధించబడ్డ గాలి పంజరంలోనే కరాళ నృత్యం చేస్తుంటుందీ.

ఆవిరవుతున్న సముద్రంలా హృదయము 
నెర్రెలు బారుతుంటుందీ.
మంటలను ఆర్పే చల్లని నీరు గుంట నక్కల నిప్పును 
మింగేస్తుంది. 
తలలు నరికే ఖడ్గాల కన్నా అగ్గిపుల్ల అడవిలో పులిలా బ్రతుకుతుంది. 
తలను వంచని పక్షి తలదించుకున్న చూపులు పైనే ఉంటాయి. 
గాలిని మింగిన మనిషి రక్తాన్ని పరిచయం చేస్తాడు. 

స్పర్శ లోనే ప్రతిపదార్థము పవిత్రమవుతుంది. 
శ్వాస తోనే విశ్వం పరిణయం ఆడుతుంది. 
ప్రణయంలోనే ప్రాణం పురుడు పోసుకుంటుంది 
విజ్ఞానం విభూదిలో మునిగితే జ్ఞానం అజ్ఞానంతో నీళ్ళాడింది.
తలుపులన్నీ మూసివేసి చీకటిని బంధించినట్లు కిటికీ కఠినంగా హెచ్చరించింది.

సూర్యా బాయి స్మృతిలో. 

డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూల్ జిల్లా.

కామెంట్‌లు
Popular posts