మరుగున పడిన మగువలు21వభాగం: - అనువాదం...అచ్యుతునిరాజ్యశ్రీ
 
డాక్టర్.కె. జానకిగారి Role of women in freedom struggle in Andhra Pradesh 
అనంత రామయ్య గాయత్రి ఉయ్యూరుకి చెందిన ఆమెకి 50రూ.ఫైన్ ఓనెల జైలుశిక్ష పడింది.మచిలీపట్నంకి చెందిన బొప్పన మాణిక్యాంబ 1920నుంచి కాంగ్రెస్ కార్యకర్త గా ఉంటూ తిలక్ స్వరాజ్యఫండ్ కి విరాళాలు సేకరించారు.మాగంటి బాపినీడు సోదరి ఐన ఆమె సంఘసంస్కరణలపై ఎన్నో రచనలు చేశారు.సంఘదురాచారాల్ని గూర్చిరాసిన వ్యాసాలు హిందూసుందరి లో వచ్చాయి.గాంధీజీ  అరెస్టయిన వార్తవిని ఆమె మానసికంగా కుంగిపోయి మెంటల్ హాస్పిటల్ లో కొన్నాళ్లున్నారు  .చర్ఖాపై నూలువడకటం, గాంధీజీ సిద్ధాంతాలనిగూర్చి విశేష ప్రచారంచేశారు.పసుపులేటి రాధా నీలాచనం నూజివీడునివాసి. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని రాజమండ్రి జైలుశిక్ష అనుభవించారు.చిట్టావర్జుల రామకృష్ణమ్మ మచిలీపట్నంవాసి. నెల్లూరు కాలేజీలో చదువుని మధ్యలో ఆపేసి1921_22లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు.పాతూరిబాలసరస్వతమ్మ 1900లో పుట్టిన నెల్లూరువాసి. భర్త సుబ్బరామయ్యతో కల్సి ఉద్యమాల్లో పాల్గొన్నారు.సింహపురి అనే వీక్లీ న్యూస్ పేపర్ ని నడిపారు.స్వాతంత్య్ర పోరాట ఘట్టాల్ని  వివరంగా తెలిపేది ఆపేపర్. శశి అనే మంత్లీ ని కూడా నడిపారు ఆదంపతులు.నెల్లూరు మున్సిపల్ కౌన్సిల్  మెంబర్ గా ఉన్న ఆమె14సెప్టెంబర్ 1975లో  మరణించారు.తిక్కవరపుసుదర్శనమ్మ నెల్లూరికి చెందిన  రామిరెడ్డిగారి భార్య. 1921లో భర్త జైలులో ఉన్నప్పుడు ఆమె ఇంటింటికీ తిరిగి విదేశీ వస్త్రాలు వస్తువులను నెల్లూరు వీధుల్లో తగలబెట్టిన వీరనారి. మద్యందుకాణాలముందు పికెటింగ్ చేశారు.హరిజనోద్ధరణకై పాడుపడిన ఆమె1936లో మృత్యువు ఒడిలో వాలారు.కందాడై యతిరాజమ్మ నెల్లూరుకి చెందిన  శ్రీనివాసన్ అలియాస్ దొరైస్వామి అయ్యంగార్ సతీమణి.ఆమె భర్త ప్రసిద్ధ నాటకకర్త, నటుడు, అధ్యాపకుడు.1921లో అధ్యాపక వృత్తికి రిజైన్ చేసి స్వాతంత్య్రోద్యమంలో చేరారాయన.రావూరి అలమేలుమంగ తాయారమ్మచీరాలవాసి.చీరాల పేరాల  ఉద్యమంలోపాల్గొన్న ఆమె తన50వ ఏట చనిపోయారు.కోట సుందరమ్మ  అద్దంకి వాసి1921_1922  లోపన్ను కట్టమని అంతా ఆందోళన చేశారు.ఆనాటి తాసిల్దార్  ఆమె మెడలో మంగళసూత్రాలు గుంజుకోటం ఓ చేదు అనుభవం🌷

కామెంట్‌లు
Popular posts