వివిధ ప్రాంతాలు అనుభవాలు తెలుపుతూ శ్రీ నాగసూరిగారు ఇలా అన్నారు"అన్నివిషయాల్లో సర్దుకుపోయే భార్య హంసవలన ఆమె అండదండలతో రచనలు సాగించగలిగాను."4రాష్ట్రాలు,8ఊళ్లు,ఢిల్లీలో కొన్ని నెలలు ఇలా సాగింది ఆదంపతుల యాత్ర!సకుటుంబంగా ఆరేడువేల పుస్తకాలను పిల్లలలాగా కంటికి రెప్ప లా చూసుకుంటూ బదిలీలతో జీవితంలో రకరకాల అనుభవాలు,పరిచయాలతో ఆనందంగా విహారయాత్ర లాగా ఎంజాయ్ చేశారు ఆదంపతులు.కాస్త సర్దుకు కుదుట పడినాక ట్రాన్స్ఫర్,లగేజీ తో సరదాగా గడపటం వారి సకారాత్మక దృక్పధంకి సరిపోయింది. 13ఏప్రిల్1988లోహిందూపురంనుంచి ఒకసూట్ కేస్ తో వెళ్లిన ఆయన పనాజీ ఆకాశవాణిలో పనిచేస్తూ యు.పి.ఎస్సీ కి సంసిద్ధం అవుతూ హెచ్.ఆర్.లూథ్రా రాసిన "ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్" పుస్తకాన్ని ఔపోసన పట్టి రేడియోగూర్చిన అవగాహన కల్గి ఉండటం ఓఅనుభవం.1938,1948 లో మద్రాస్,విజయవాడ ప్రసారాలు చాలా గొప్ప గా తెలుగుకి వెలుగునిచ్చాయి.విజయవాడ లో ఉదయం7.15_8గంటలదాకా
మద్రాస్ లో ఉదయం 8.15.నుంచి 9దాకా ఈయన పర్యవేక్షణ లో కార్యక్రమాలు ప్రసారమైనాయి.విజయవాడ ఉదయరేఖలు మద్రాసు*మల్లెపూదండ* పరిమళించిన భలేమంచి పసందైన రోజులు.ప్రయాగవేదవతిగారు వేణుగోపాల్ గారిని మెచ్చుకుంటూ పెక్స్ ఉద్యోగ బాధ్యతలగూర్చి భలేగా రాశారనటంతో ఆనందం ఆర్ణవమైంది. ప్రతి ఏడూ అపార్(ఆన్యువల్ పర్ఫార్మెన్స్ అప్రయిజల్ రిపోర్టు) లో ప్రతి ఉద్యోగి బాధ్యతలు సాధించిన విజయాలు తెలపాలి. అలాతన ఉద్యోగంలో పైమెట్టు చేరగలరు. అందుకే ఆకాశవాణి ప్రోగ్రాంజోన్ లో జనులగూర్చి వ్యవసాయం,చారిత్రక నేపథ్యం సమస్యలు, భాష సంస్కృతులగూర్చిన సంపూర్ణ అవగాహన కలిగేలా నాగసూరి గారు బాగా కృషిచేసి సఫలీకృతులైనారు. అందుకే అందరికీ సులభంగా అర్ధమయ్యేలా ఆసక్తికరంగావివిధవిషయాలపై గ్రంథాలు రాయగలిగారు.సృజనాత్మకత,ఉత్సాహం,అభిరుచి,తపన ఉండితీరాలి.
ఇక ఎంతోమంది పెక్స్ లు, ట్రెక్స్ లు, అనౌన్సర్లతో కలిసి పనిచేశారు.ఇందులో ఆయన కి బాగా సహకరించిన గొల్లపల్లి మంజులాదేవి 1994లో కడపలో అనౌన్సర్.ఆపై ఆమెతో కడప తిరుపతి ఆకాశవాణి కేంద్రాల్లో చేసిన ప్రోగ్రామ్స్ జనం కినచ్చటం, అవి విజయవంతం కావటం హర్షణీయం. ఆమె ఇంకా 5ఏళ్ల సర్వీసు ఉండగా కన్నుమూయటం బాధాకరం.ఇలా రేడియో లో జాబ్ అంటే సమిష్ఠికృషి, అందరిలో ఒకడై కల్సిపోతూ అందరిసహకారంతో మంచి ప్రోగ్రామ్స్ చేసినందుకు ఆనందించారు ఆయన. ఇప్పటికీ పుస్తకంలో పంచుకొని పఠితలకు అవగాహన కల్పించడం ఓవిశేషం🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి