అంశము: నిషిద్ధాక్షరి- :
ర. ల.. వ అక్షరాల నిషేధము విషయము: వేంకటేశ్వర వర్ణన ఛందస్సు: నచ్చిన వృత్తము
నమో వేంకటేశ!
చంపకమాల:
ముడుపును గట్టి మొక్కగను ముక్తి కి నిచ్చెన నీదు నామమే
ఇడుములు బాప దీనజన మిచ్చెడు కానుక హుండి నిండ, మా
తడబడు భక్తి చింతన ను తట్టి తమస్సున కాంతి నింపగా
పొడమిన అంబుజాక్షి పతి పూజ్యుడు నిత్యము పూజ సేయగన్
====
- ముడుపులకు పేరు గాంచిన దేవుడు, ముక్తి ప్రదాత (నామము) - వేంకటేశ్వరుడు
- ఆపద మొక్కులు "హుండీ "కానుకలు - వేంకటేశ్వరుడు
- భక్తి , జ్ఞాన అంధకారము తొలగించిన వాడు - వేంకటేశ్వరుడు
- అంబుజాక్షి పతి - లక్ష్మి పతి - వేంకటేశ్వరుడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి