ఘన తెలంగాణ శ్రీ సురవరం ప్రతాపరెడ్డి
మన తెలుగు రాష్ట్ర ప్రజల బంగారపు గడ్డి
రంగమ్మ నారాయణరెడ్డి వీరి మాతా పితలందురు
మన పూర్వ పెద్దలు చెప్పంగా మీరందరు విందురు !
గోలకొండ ప్రజావాణి పత్రికలను నడిపినాడు
సాహిత్యం పైనే అధిక కాలాన్ని గడిపినాడు
తెలంగాణలో కవులు పూజ్యం దుస్థితిని చెడిపినాడు
తెలుగు కళాకారుల పరువు ప్రతిష్టని నిలిపినాడు !
అందు ప్రపంచ మేధావుల సూక్తులను ప్రచురించారు
చదివిన చదువరులంతా పరవశించినారు
ఆనాటి ప్రభుత్వం దీన్ని సమస్యగా భావించే
మన సురవరాన్ని పలు రకాలుగా అది వేధించే
వెలుగు మొగలాయి కథలు వ్రాసిన పండితుడు
తెలుగు ప్రజల హృదయాలలో తాను బంధితుడు
అందుకే ఆయనను మనం కలలో కూడా మరువం
ముందుకేగి జయంతి ఉత్సవాలు చేయుటకు వెరువం !
మన సురవరం తెలుగు సాంస్కృతిక గోపురం
ఘన కవితలతో కథలతో చేసెను కాపురం
ప్రముఖ పాత్రికేయుడు పరిశోధకుడు సురవరం
సుముఖంగా ప్రజల గుండెల్లో పొందేను స్థావరం!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి