చెట్టు చెలిమి: - డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
ఆకాశాన్ని తాకే ఆకుపచ్చ లోకం అందం
నేలపరుచుకున్న ఆత్మీయ దీపం
సేదదీరే జీవుల రక్షణ ఉద్దీపన

స్వేచ్ఛగా గాలి వీచే ఆకులు
రాలి నేలపై ముద్దాడు చెట్టు వేళ్ళ మూలాలు
ఎంత ఎత్తు ఎదిగినా 
పుట్టుక మరువని ప్రకృతి కవితగా

 అదో ఆత్మీయ రక్తధార దానకర్ణ బంధం
తల్లి బిడ్డకు పాలపొంగు కాని జీవామృతం

నేను ఎదిగాననే మూడు పొరల
మెదడు విలాస విలాప విన్యాసం 
ఓ సామాజిక మానసిక సుఖదుఃఖాల త్రివేణి

మనిషిని అదిమిపెట్టే కళ్ళూ కాళ్ళు 
తలవాల్చాలి వేళ్లపై చెలిమి చెట్టు ఆకుల్లా 
మనిషిని మనిషి అల్లుకున్న బంధం
నిప్పు కాలిన బంగారు నిగారింపు

వ్యక్తిత్వ హననం,అస్తిత్వ హత్య 
చాపకింద నీరు
ఎదురుతిరిగిన సహనం ఎరుపెక్కిన కథాకథనం
కాలి బుడిదైన కట్టెలమోపు చరిత్ర
దుర్మార్గం పిల్లిమొగ్గలను కాల్చేసే వర్తమానంలో ఈ మట్టి. 


కామెంట్‌లు
Popular posts