కృతజ్ఞత గొప్పది : - --గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
మూర్ఖులతో వాదన 
చివరికగును వేదన 
ఉండాలోయ్! దూరము 
లేకుంటే క్షామము 

విశ్వాసఘాతుకులు 
కడు ప్రమాదకారులు 
కనిపెట్టి ఉండాలి 
దూరంగా ఉంచాలి 

పనికిరాని వ్యక్తులు 
అతి ప్రమాద ఘంటికలు 
జాగ్రత్త వహించాలి 
ఆదిలో త్రుంచాలి 

కృతఘ్నత చూపితే 
అత్యంత దారుణము 
కృతజ్ఞత చాటితే 
కలుగజేయు గౌరవము


కామెంట్‌లు