శ్రేష్టమైన పుస్తకాలు : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
అమూల్యమైన పుస్తకాలు 
కాంతులీనే కాగడాలు 
అజ్ఞానాంధకారము తరిమి 
బాగుచేయును జీవితాలు 

పుస్తకాల పారాయణము 
బహు శ్రేష్టమైన అలవాటు 
పదును పెట్టును మేధస్సుకు 
ప్రశాంతతనిచ్చును మనసులకు 

బ్రతుకులో  శ్రేయోభిలాషులు
ప్రకాశమానమైన తారలు 
స్నేహితులే పుస్తకాలు 
వెలిగిస్తాయి జీవితాలు 

తోడొచ్చును ప్రయాణంలో 
మేలు చేయును జీవితంలో 
ఒంటరితనం పోగొట్టును 
అమ్మ మాదిరి ఆదరించును 

అనునిత్యమూ పఠించాలి 
విజ్ఞానం పెంచుకోవాలి 
పుస్తకాలతో  అనుబంధము 
రోజు రోజు పెరుగుతుండాలి 

పుస్తకాలే లోకమవ్వాలి 
హస్త భూషణమే కావాలి 
పాఠకుల సంఖ్య పెంచాలి 
పూర్వ వైభవమే తేవాలి 


కామెంట్‌లు
Popular posts