ఆ చండాలుడు చేయించు యజ్ఞమునకు
దేవతలు, ఋషులు ఎలా స్వీకరింతురు
విశ్వామిత్రుని పిలుపుకుతలోగ్గి
చండాలని భోజనం స్వీకరించి
బ్రాహ్మణులైన మహాత్ములైన గాని
తిరిగి స్వర్గము ఎలా చేరగలరు
వారు తెలిపిన మాటలులిని విశ్వామిత్రుడు
పట్టరాని కోపముతో కన్నులెర్ర చేసి
పవిత్రంగయున్న నన్ను దూషించిన వారు
మసైపోతారని శపించాడు
నేడే వారంతయు యమ పాషముతో
నరక లోకముకు వెళ్ళిపోతారు
ఏడువందల జన్మల వరకు వారంతా
శవములను బక్షిస్తూ బ్రతుకుతారు
వారంతా ముష్టిజాతకులై పుట్టి
కుక్క మాంసము తినుచూ జీవిస్తారు
ధర్మాత్ముడైన అతడిని సజ్జనుడైన నన్ను
పలు మాటలతో దూషించినందుకు
వారు కిరాతకులై జనులను పీడిస్తూ
సకలకాలం నా శాపమనుభవిస్తూ బ్రతుకుతారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి