బొడ్డు కూడా సరిగ్గా వూడని ఓ బుడ్డోడు ,
బీహార్ రాష్ట్ర బుల్లోడు ,
తన ప్రతిభతో ప్రపంచ దేశాల దృష్టి
తన వైపు తిప్పుకున్నాడు !!!
సిక్సర్ల పిడుగు ,
బౌండరీల బుడుగు ,
అసలైన చిచ్చర పిడుగు !
తన ఆటతో చేస్తున్నాడు
మైదానాన్ని కాళింగ మడుగు !
బాల భీముడిలా
బంతిని బాధిస్తుంటే చకచక ,
బంతిని ఎటు విసారాలో తెలియక !
బౌలర్ల పడిపోతున్నారు తికమక !
బుమ్రా అంటే భయం లేదు ,
కమ్మిన్స్ అంటే పికర్ లేదు !
ఎంత పెద్ద మైదానమన్న చిన్నబోతుంది
తన ఆట ముందు!
అతనే వైభవ్ సూర్య వంశీ!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి