ప్రాణి ప్రపంచం: -డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.
స్వాగతం!సుస్వాగతం!
చుట్టూ తిరిగి చూడండి!
మీ కళ్ళకే ఆనందమండీ!
మనసులకెంతో హాయేనండీ!
జంతులోకం!జంతులోకం!!

నీళ్ళలోని ఖడ్గమృగం
పచ్చికమేసే జిరాఫీ
గాండ్రు గాండ్రుమను సింహం
ఒంటి చారలతో పులి దర్పం
జంతులోకం!జంతులోకం!!

రెపరెపలాడే రెక్కలతో
కువకువలాడే శబ్దాలతో
రంగు రంగుల పక్షులు
రకరకాల పేర్లతో గూళ్ళు
జంతులోకం! జంతులోకం!!

ఎత్తైన ఆకారాల పెద్ద ఏనుగులు
చెంతనే నడిచే ముద్దు గున్నలు
తొండాలతో చిమ్ముకునే జలాలు
తెల్లని కొమ్ముల చక్కని‌ అందాలు
జంతులోకం! జంతులోకం!!

బాతులు,కొంగలు,చేపలు
కోతులు,కొండెంగలు,కోళ్ళు
రంగులు మార్చే ఊసరవెల్లులు
పాములు,ముంగిసలు,తేళ్ళు
జంతులోకం! జంతులోకం!!

సరదాలకు సఫారీ షికార్లు
చుట్టూ తిరిగి చూపే రైళ్ళు
కంటికింపుగొల్పే పచ్చికలు
మధ్యమధ్యన మ్యూజియాలు
జంతులోకం! జంతులోకం!!

కామెంట్‌లు
Popular posts