తృప్తికర భోజనానికి మరింత సంతృప్తిని సమకూర్చేది తాంబూలం.
తాంబూలం అంటే ఒక వక్క రెండు ఆకులు అంత సున్నం కలిపినమిలేయడం కాదండి!
తాంబూలానికి మన పురాణాలలో ప్రబంధాలలో ఉన్నది ప్రముఖ పాత్ర
మను చరిత్ర అందులో ప్రవరుడు.
దారి తప్పిన నాయకుడు. ఇంతలో గంధవహుడు ( గాలి)
మోసుకొచ్చాడు
"మృగమద సౌరభ విభవ
ద్విగుణిత ఘనసార
సాంద్ర పరిమళమై......
గాలిలో కమ్మని వాసనలు ఝుమ్మని ప్రవరుని చుట్టు ముట్టాయి.
సూక్ష్మగ్రాహి ప్రవరుడు అందుకే అది కమ్మని తాంబూలపు వాసన అనీ గ్రహించి
అటుగా వెళ్లి అతిలోక సుందరి వరూధునిని
కలవడం తాంబూలం మహిమే. అసలైన తాంబూలం అదే. తాంబూలంలో ఆడవాళ్లు తాంబూలం మగవాళ్ళ తాంబూలం వేరే ఉంటుందనీ మీకు. తె లుసా
త్యాగయ్య కూడా
" విదుముఖ కమ్మని విడెము వేసి మమ్మాశీర్వదించి"అంటూ తాంబూల ప్రసక్తి తెచ్చాడు.
పాట రాయండి కవిత్వం రాయండి అంటే ఊరికే రాస్తారా అంటూ పెద్దన్న
మనసుకింపైన భోజనం, రమణి ప్రియదూతిక
తెచ్చి ఇచ్చు కప్పురపు విడేము ఇలా అన్ని ఉంటేనే రాయడం సాధ్యం అనడం లో
తంబూలానికి ముఖ్య స్థానం ఇచ్చాడు.
తాంబూలం సున్నంతో కలవడం వల్ల కాల్షియం పుష్కలంగా లభిస్తుంది ప్రతి ఆకులో ఏదో ఒక గుణం ఉంటుంది.
జీర్ణకారి రుచికరం
తృప్తికరం యాలకులు లవంగాలు కుంకుమపువ్వు జాజి జాపత్రి అన్ని వేసిన ఒక్కపొడి మా కాలంలో ఇంట్లోనే తయారు చేసే వాళ్ళం. తమలపాకులు రోజు తప్పనిసరి ఓ కట్ట ఇంట్లోకి వచ్చి పడేది. భోజనానంతరం ఏదో ఒక పెద్ద తతంగం.
ఈ రోజుల్లో వచ్చే పాన్ కిల్లి ఇలాంటి వాటిల్లో ఏం చేస్తారో
వాళ్లకే తెలియాలి.
పెళ్లి ముహూర్తాలలో తాంబూలాలు మార్చుకోవటం
ముత్తైదులకు తాంబూలాలు ఇవ్వడం
దేవుడికి టెంకాయ తాంబూలం సమర్పించడం ఇవన్నీ సంప్రదాయంలో ముఖ్యాంశాలు ఇంతటి ప్రాముఖ్యత గల తాంబూలాన్నిఈరోజు తలుచుకోవడం
ఎంతో ఆనందకరం.
పురాణాలలో తాంబూల ప్రసక్తి గురించి మరోసారి ముచ్చటించుకుందాం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి